సత్యసాయి: సత్యసాయిబాబా జన్మదిన వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇవాళ పుట్టపర్తికి చేరుకోనున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి రానున్నారు. అనంతరం బాబా మహాసమాధిని దర్శించుకుని, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.