NLG: జిల్లాలో వరి ధాన్యం సేకరణ సజావుగా సాగుతోంది. వానాకాలంలో 5.26 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా, 13.44 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేశారు అధికారులు. మిల్లర్లు 4.73 లక్షల టన్నులు కొనుగోలు చేయగా, 6.30 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు చేరనున్నాయని వ్యవసాయ శాఖ తెలిపింది.