NLG: హైదరాబాద్ శిల్పారామంలో నల్గొండ విద్యార్థులు అద్భుత నృత్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్పెషల్ అధికారి జి. కిషన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో గురువు సర్వసిద్ధి కళ్యాణి శేఖర్ శిష్యులు ‘సీత కళ్యాణం’, ‘ముద్దుగారే యశోద’ గానాలకు నృత్యాలు చేసి మంత్రముగ్ధులను చేశారు. జీఎం వెంకటేశ్వర్లు, ఈఈ ఉషారాణి బహుమతులు అందజేశారు.