NDL: బండి ఆత్మకూరు మండలం రామాపురం గ్రామంలో బుధవారం రాత్రి ఎస్సై జగన్మోహన్ ప్రజలతో సమావేశం నిర్వహించారు. సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళలపై నేరాలు, హెల్మెట్ల వినియోగంపై ప్రజలకు వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.