AKP: పరవాడ మండలం పి. బోనంగిలో ఓ ప్రైవేట్ పాఠశాల ఛైర్మన్ విద్యార్థినిపై అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని అందిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లికార్జునరావు బుధవారం తెలిపారు. మాకవరపాలెంకి చెందిన ఓ విద్యార్థిని హాస్టల్లో ఉంటు ఇంటర్ చదువుతుంది. పాఠశాల ఛైర్మన్ ఈనెల 8న విద్యార్థిని తన క్యాబిన్‌కు పిలిపించుకొని చెంపపై కొట్టాడని ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.