SKLM: విద్యార్థులు క్రీడలతో పాటు విద్యలోనూ ప్రతిభ చాటాలని MLA గోవిందరావు అన్నారు. గురువారం స్థానిక గిరిజన సామాజిక భవనం ఆవరణంలో జరుగుతున్న 69వ AP అంతర్జాతీయ పాఠశాల క్రీడల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని, విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు, ప్రైజ్‌మనీని అందజేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. క్రీడాకారులు తమ లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం శ్రమించాలని అన్నారు.