VSP: రేపటితో మొదలుకానున్న సీఐఐ సదస్సుకు 3,500 మంది పోలీసులతో పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం తెలిపారు. ఈ సదస్సుకు వచ్చే ప్రతినిధులకు విమానాశ్రయం నుంచి గమ్యస్థానానికి చేరేవరకు పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. ఢిల్లీ ప్రేలుడు సంఘటన నేపథ్యంలో రాష్ట్రం అప్రమత్తంగా ఉందని తెలిపారు.