ప్రకాశం: జిల్లా వ్యాప్తంగా ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో బుధవారం వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విద్యార్థుల్లో ప్రాముఖ్యతపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.