VZM: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 సమీపంలో జరిగిన ఘోరమైన బాంబు పేలుళ్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు మరిపి విద్యాసాగర్ తెలిపారు. ఈ విషాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అధికారులు విచారణ జరిపి నేరస్థులను త్వరగా పట్టుకోవాలన్నారు.