WGL: భక్తుల సౌకర్యార్థం ఏసీ బస్సు సేవలు ప్రారంభమవుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ఆర్ఎం డి.విజయభాను తెలిపారు. ఈ నెల 14 నుంచి హనుమకొండ బస్టాండ్ నుంచి ఉదయం 9 గంటలకు శ్రీశైలం, 8.40 గంటలకు తిరుపతికి ఏసీ రాజధాని బస్సులు నడుస్తాయి. సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం, రాత్రి 11.10 గంటలకు తిరుపతి చేరుకుంటాయి. భక్తులు ఈ సేవలు వినియోగించుకోవాలని సూచించారు.