SKLM: నందిగాం మండలం తురకల కోట గ్రామానికి చెందిన ఎం. వెంకట రావు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి ఇద్దరిని ఆదివారం రాత్రి అరెస్టు చేసినట్లు ఎస్సై షేక్ మహ్మద్ ఆలీ తెలిపారు. వెంకటరావును బెదిరించిన పెట్రోల్ బంక్ యజమానితో పాటు ఓ కానిస్టేబుల్ను అరెస్ట్ చేసి టెక్కలి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు.