NLG: చింతపల్లి ప్రభుత్వ పాఠశాలలో పేరుకుపోయిన చెత్త, పిచ్చిమొక్కలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన పూర్వ విద్యార్థులు జేసీబీ సహాయంతో పాఠశాల ఆవరణను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎమ్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు సుధీర్, అన్వర్, పూర్వ విద్యార్థులు రాజేష్, సాగర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.