MBNR: పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డి. జానకి స్వయంగా ప్రజల నుంచి 12 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా SP వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రీవెన్స్డేలో వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి,ఫిర్యాదులను పర్యవేక్షిస్తామని తెలిపారు.