అన్నమయ్య: మదనపల్లెలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో రేపు AP స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్ ఆర్. గురుప్రసాద్ తెలిపారు. ఉదయం 9 గంటలకు మేళా ప్రారంభమవుతుందన్నారు. ఈ మేళాలో వివిధ సంస్థల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.