ADB: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 16న ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జూనియర్ జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ గౌరవ అధ్యక్ష, కార్యదర్శులు ఉష్కం రఘుపతి, రాష్ట్రపాల్ పేర్కొన్నారు. ఎంపికైన జిల్లా జట్టు 51వ రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు.