పాకిస్తాన్ రాజ్యాంగంలో 27వ సవరణకు ఆ దేశ సెనెట్ ఆమోదం తెలిపింది. దీంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పదవితోపాటు.. ఫెడరల్ రాజ్యంగ కోర్టు ఏర్పాటు కానుంది. ఈ బిల్లుకు మూడింట రెండోంతుల మెజార్టీ లభించింది. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చేతికి కీలక అధికారాలు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సైనిక రాజ్యాంగానికి స్వాగతం అంటూ మాజీ సెనెటర్ అఫ్రాసిబ్ ఖట్టాక్ విమర్శించారు.