TG: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూముల సర్వేకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సర్వే శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నియమించిన 3,500 మందికిపైగా లైసెన్స్డ్ సర్వేయర్లు, ఇప్పటికే పనిచేస్తున్న సర్వేయర్లతో సర్వే చేపట్టాలని యోచిస్తోంది. ఇందుకుగానూ జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేయాలని కలెక్టర్లకు సీసీఎల్ఏ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెళ్లాయి.