KRNL: ఆలూరు మండలంలోని కురువళ్లి గ్రామంలో సోమవారం స్కూటర్ అదుపు తప్పి షేక్షావలి (30) అనే వ్యక్తి మృతి చెందాడు. హాలహర్వి గ్రామానికి చెందిన షేక్షావలి, ఆలూరులో పని ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా, మార్గమధ్యలో కుక్కను తప్పించబోయి కింద పడ్డాడు. తీవ్రగాయాలతో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.