TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా పోలింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత కల్పించారు. 1,761 మంది సిటీ పోలీసులతోపాటు 80 మంది కేంద్ర బలగాలు మోహరించాయి. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించారు. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండటంతో అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు.