HYD: రేపు యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. సెగ్మెంట్లో 4,01,365 ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,94,631(48.49%) మాత్రమే ఓటు వేశారు. 10 రౌండ్లు, 42 టేబుళ్ల మీద కౌంటింగ్ ఉంటుంది. షేక్ పేటలోని 1వ బూత్‌తో మొదలై ఎర్రగడ్డలోని 407 బూత్ కౌంటింగ్‌తో ముగియనుంది. సీసీ కెమెరాల నిఘాలో ఈ ప్రక్రియ జరగనుంది.