W.G: జిల్లాలోని పాలకొల్లు, నరసాపురం, పెనుమంట్ర, వీరవాసరం మండలాల్లో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ సభ్యుడు జే. కృష్ణ కిరణ్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. దిగమర్రు జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. అనంతరం గురుకుల పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను, ఎమ్ఎల్సీ పాయింట్లను తనిఖీ చేసి, నాణ్యతా ప్రమాణాలు, హాస్టళ్ల వసతులపై ఆరా తీశారు.