TG: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో రెండో రోజు కూడా భక్తులకు స్వామి దర్శనాలను నిలిపివేశారు. ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో నిన్నటి నుంచి దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే స్వామివారికి నిత్యం నిర్వహించే కైంకర్యాలను యథావిధిగా కొనసాగుతున్నాయి. అటు భక్తులకు ఆలయం ముందు ప్రచార రథం, LED స్క్రీన్ ఏర్పాటు చేసి స్వామివారి దర్శనాలను కల్పిస్తున్నారు.