SS: పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలు, నాయకులను కాపాడుకుంటామని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో టీడీపీ జెండా ఎగరాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.