SRPT: హుజూర్ నగర్ పట్టణం గుండా పోయే 167 జాతీయ రహదారిపై గోపాలపురం గ్రామంలో బూరుగడ్డ వెళ్లే క్రాసింగ్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతన బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా హుజూర్ నగర్ ఎస్సై మోహన్ బాబు మాట్లాడారు. స్టాప్ బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల వాహనాల వేగం తగ్గుతుందని తద్వారా ఇతర వాహనదారులకు, పాదాచారులకు ఇబ్బందులు ఉండవని అన్నారు.