HYD: ఢిల్లీ పేలుడు దృష్ట్యా హైదరాబాద్లో హై అలర్ట్ కొనసాగుతోంది. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ క్రమంలో హోటళ్లు, లాడ్జీల యజమానులతో పోలీసులు సమావేశమయ్యారు. హోటల్స్కు వచ్చేవారి ఐడీలు తప్పక తనిఖీ చేయాలని, వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు.