ELR: భీమడోలు మండలం కొండ్రెడ్డినగర్ సమీపంలో సోమవారం రాత్రి పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. కాకినాడ నుంచి ప్రకాశం జిల్లాకు ఇంధనం తీసుకెళ్తున్న ట్యాంకర్‌కు ఓ కారు అకస్మాత్తుగా అడ్డురావడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. భీమడోలు సీఐ విల్సన్, ఎస్ఐ భాషా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.