AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు ఈనెల 13 నుంచి 25 వరకు చెల్లించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. లేట్ ఫీజు రూ.50తో ఈనెల 26 నుంచి డిసెంబర్ 3, లేట్ ఫీజు రూ.200తో DEC 4 నుంచి 10, లేట్ ఫీజు రూ.500తో DEC 11 నుంచి 15 వరకు చెల్లించవచ్చు. ఎక్కువ మంది చివరిలో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రయత్నిస్తే సర్వర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని, ముందే చెల్లిస్తే మంచిదని అధికారులు సూచించారు.