KNR: ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు బొమ్మనపల్లి – ఉల్లంపల్లి గ్రామాలకు వెళ్లే మట్టి రోడ్డుపై పెద్ద గండి పడింది. దీంతో గ్రామాలకు రాకపోకలు సాగించాలంటే వాహనాలు, వరికోత యంత్రాలకు తీవ్ర ఇబ్బందవుతోందని గ్రహించిన రైతులు గండిని పూడ్చారు. అయితే, పలుమార్లు అధికారులకు సమస్యను తెలిపిన పట్టించుకోలేదని, వారే పూర్తి చేసుకున్నారు.