ATP: రాప్తాడులో రూ. 61 లక్షలతో నిర్మిస్తున్న అన్న క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఇవాళ పరిశీలించారు. ఇప్పటివరకు 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పేదలు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ క్యాంటీన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సునీత తెలిపారు.