KMM: ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల మంజూరు, భూమి వివాదాలు, ఉద్యోగ అవకాశాలు, స్మశాన వాటిక స్థల సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.