అన్నమయ్య జిల్లా చిన్నమండెంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్, కలెక్టర్ నిశాంత్ కుమార్తో కలిసి హెలిప్యాడ్, ప్రజా వేదిక, టిడ్కో ఇళ్లు, కాన్వాయ్ మార్గాలను పరిశీలించి, భద్రతా ప్రణాళికను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.