GDWL: ధరూర్ మండల పరిధిలోని పారుచర్ల సమీపంలో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో, బైక్పై వెళ్తున్న దయాకర్ రెడ్డికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.