సూర్యాపేట జిల్లా పరిధిలో మహిళల మెడలో బంగారు గొలుసులు చోరీ చేస్తున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి సమయంలో ఆరుబయట నిద్రిస్తున్న మహిళల మెడలో బంగారు గొలుసులు చోరీ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు వారిని అర్వపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ కేసు వివరాలు తెలిపారు.