ATP: ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో జిల్లాలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎస్పీ జగదీష్ ఆదేశాలతో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, టోల్గేట్లు, లాడ్జీలు, రద్దీ ప్రదేశాలలో వాహనాలు, అనుమానితుల కదలికలు, లగేజీలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు.