సత్యసాయి: సత్యసాయి శత జయంతి వేడుకల కోసం భక్తులకు వీలుగా రైల్వే శాఖ 65 ప్రత్యేక రైళ్లతో పాటు, ఈనెల 13 నుంచి డిసెంబరు 1 వరకు 682 సాధారణ రైళ్లను నడపనుంది. పుట్టపర్తి బస్టాండ్-రైల్వేస్టేషన్ మధ్య 20 బస్సులను అందుబాటులో ఉంచారు. వైద్య సేవలకు 10 శిబిరాలు, పారిశుద్ధ్య నిర్వహణకు 250 మంది సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు.