KDP: PM స్వానిది కింద ఆర్థిక సాయం కోసం చిరు వ్యాపారులు దరఖాస్తు చేసుకోవాలని స్థానిక మున్సిపల్ మెప్మా అధికారి మహాలక్ష్మి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. చేతివృత్తుల వారు, స్ట్రీట్ వెండర్స్, ఇతర చిరు వ్యాపారులకు వ్యాపార అభివృద్ధి కోసం PM స్వానిది కింద రూ. 15 వేలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఆసక్తిగలవారు మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా విభాగంలో సంప్రదించాలన్నారు.