GDWL: ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై, అక్రమ మార్గాన డబ్బు సంపాదించాలనే అత్యాసతోనే మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు తేలింది అని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస్ రావు ఇవాళ తెలిపారు. గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శేరెల్లివీధిలో బలిజ లక్ష్మి (55) హత్య కేసులో ప్రధాన నిందితుడు రాంరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.