SRD: దేశ తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంగళవారం అదనపు కలెక్టర్ మాధురి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆమె మాట్లాడుతూ.. అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని చెప్పారు. దేశ విద్యా శాఖ మంత్రిగా విద్యా అభివృద్ధికి ఆయన కృషి చేశారని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.