ASR: డుంబ్రిగుడ మండలంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. గంజా సాగు, వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన పరిణామాలు, అలాగే చిన్న వయసులో వివాహాలపై ఉన్న చట్టాల గురించి పోలీస్ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ధర్మ, ఐసీడీఎస్ అధికారిణి రాణి తదితరులు పాల్గొన్నారు.