SRD: స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో జిల్లాస్థాయి ఖోఖో బాలుర- 14, 17 పోటీలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అంతకుముందు క్రీడాజ్యోతిని వెలిగించారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు.