జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు 1,761 మంది పోలీసులతో, 800 మంది కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 139 డ్రోన్ల ద్వారా అధికారులు మానిటరింగ్ చేయనున్నారు. మరోవైపు బీహార్‌లో రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 20 జిల్లాల్లో 122 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.