KKD: పిఠాపురంలోని ఉప్పాడ రైల్వే గేటు మంగళవారం నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎల్సీ 431 దగ్గర ఈ నెల 15 వరకు మరమ్మతులు జరుగుతాయని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గేటు మూసి వేసి ఉంటుందని చెప్పారు. అయిదు రోజులపాటు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలని సూచించారు.