హైదరాబాద్కు చెందిన డాక్టర్ మొయినుద్దీన్ సయ్యద్ NTT ద్వారా ISKP నెట్ వర్క్ విస్తరించడానికి ప్రయత్నించాడు. దీనికోసం హైదరాబాద్ తో పాటు వివిధ నగరాలు, రాష్ట్రాల్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపాడు. ఇతడి ద్వారా ఎంతమంది ఉగ్రబాట పట్టారనేది ATS ఆరా తీస్తోంది. గడచిన కొన్నేళ్లుగా అతడి కదలికలు, సంప్రదింపులు జరిపిన వ్యక్తులు, తదితర విషయాలపై విచారణ చేస్తోంది.