SKLM: నరసన్నపేట మండలంలోని ఒక గ్రామంలో రెండవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన వృద్ధుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విద్యార్థిని సోమవారం తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ దుర్గాప్రసాద్, నిందితుడైన వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు.