KRNL: ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు నేపథ్యంలో కర్నూల్ వ్యాప్తంగా అప్రమత్తతా చర్యలు ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. కర్నూలు, గుత్తి పరిధిలోని పెట్రోల్ బంకులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్ గేట్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.