ASR: డుంబ్రిగూడ మండల పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రోడ్డు కూడా కనిపించనంతగా పొగమంచు వ్యాపించడంతో వాహనదారులు హెడ్‌లైట్స్ వెలిగిస్తూ జాగ్రత్తగా ప్రయాణించారు. అరకు అందాలను ఆస్వాదించేందుకు వచ్చిన పర్యాటకులు ఈ అపూర్వమైన పొగమంచు వాతావరణాన్ని చూసి ఫిదా అవుతున్నారు. డుంబ్రిగూడలో ఉష్ణోగ్రతలు 15.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.