ATP: గుంతకల్లు మండలం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఇవాళ ఆంజనేయస్వామి భక్తులు హనుమత్ అర్ధ మండల దీక్షలు( మాల ధారణ) ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయంలో ఆంజనేయస్వామి మూలమూర్తికి విశేష పూజలు చేశారు. స్వామి వారికి సింధూరం, ఆకు పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆంజనేయ స్వామి మాల ధారణ ధరించారు.