ఈనెల 14న ‘శివ’ చిత్రం 4K ఫార్మాట్లో రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నాగార్జున, RGV ఒక ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో “ఇప్పుడు ‘శివ’ సినిమా తీస్తే ఎవరితో తీస్తారు?” అని ఓ రిపోర్టర్ RGVని ప్రశ్నించాడు. “ఇప్పుడు కాదు, ఇంకో 36 ఏళ్ల తర్వాత అయినా కూడా ‘శివ’లో హీరో నాగార్జుననే” అని RGV స్పష్టం చేశాడు. నాగార్జున లేకుండా ‘శివ’ చిత్రాన్ని ఊహించుకోలేమని పేర్కొన్నాడు.