కడపలోని శ్రీచైతన్య పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని జస్వంతి మృతిపై మంత్రి లోకేష్ ఆరా తీశారు. ఇందులో భాగంగా బాలిక గత కొంతకాలంగా మైగ్రేన్ పెయిన్‌తో బాధపడుతున్నట్లు, మానసిక ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి విద్యార్థులు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. అయితే బాలిక మృతిపై సమగ్ర నివేదికను మంత్రి లోకేష్‌కు విద్యాశాఖ అధికారులు పంపారు.