NLR: జిల్లా దివ్యాంగులు, వృద్ధులు, హిజ్రాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సుమారు 30 మంది ట్రాన్స్ జెండర్లకు కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. 2019 హిజ్రాల చట్టం ప్రకారం వారికి సమాజంలో గౌరవం కల్పించాలనే లక్ష్యంతో నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్ జెండర్ పర్సన్స్ పోర్టల్ ద్వారా వీటిని మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.